![]() |
![]() |

బీటౌన్‌లో అప్‌కమింగ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సెల్ఫీ. అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్నారు. ఆయన పక్కన హీరోయిన్గా మృణాల్ ఠాకూర్ కనిపిస్తారు. సీతారామమ్‌లో జనాలకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో అల్ట్రా గ్లామర్ అవతార్‌ని సెలక్ట్ చేసుకున్నారు. సెల్ఫీలో సెకండ్ సాంగ్ గ్లింప్స్ ఇవాళ విడుదలైంది. పూర్తి పాట ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ పాటను చూసిన ఓ నెటిజన్ కిలాడీ ఈజ్ బ్యాక్ అని రాశారు.
మై కిలాడీ తూ అనారి అని తొంభైల్లో దుమ్మురేపిన పాట ఇది. అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ చేశారు. రాజ్ మెహతా దర్శకత్వం వహిస్తున్నారు. అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మి, నష్రత్ భారుచా, డయానా పెంటీ కీ రోల్స్ చేస్తున్నారు. ఈ నెల 24న థియేటర్లలోకి రానుంది సెల్ఫీ. సౌత్‌లో లాస్ట్ ఇయర్ చాలా ట్రెడిషనల్ లుక్‌లో కనిపించిన మృణాల్ ఠాకూర్‌కి, నార్త్ లో ఈ సినిమా చాలా క్రూషియల్. అక్కడ కూడా క్లిక్ అయితే, సీనియర్ హీరోల పక్కన వరుసగా ఛాన్సులు కొట్టేయవచ్చు.
సబ్జెక్ట్ ఏ కాలానికి సంబంధించినదైనా సెట్ అయ్యేలా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నారు మృణాల్ ఠాకూర్. సినిమాల సెలక్షన్ విషయంలో మాత్రమే కాదు, పర్సనల్ లైఫ్‌లోనూ, ఎక్స్ ప్రెస్ చేసే థాట్స్ లోనూ చాలా వైవిధ్యంగా అనిపిస్తున్నారు సిల్వర్‌స్క్రీన్ ప్రిన్సెస్ నూర్జహాన్. అక్షయ్‌కుమార్‌కి 2022లో ఒక్క హిట్ కూడా లేదు. ఈ ఏడాది సెల్ఫీ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారు ఖిలాడీ. ఆల్రెడీ ఈ ఏడాది బాలీవుడ్ పాజిటివ్‌గా స్టార్ట్ అయింది. అక్షయ్ సెల్ఫీ ఆ వైబ్స్ ని కంటిన్యూ చేస్తుందని ఆశిస్తున్నారు బీ టౌన్ ఆడియన్స్.
![]() |
![]() |